Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మోదీతో భేటీకి కేసీఆర్ రెడీ... తెలంగాణ పర్యటనకు మోదీకి ఆహ్వానం పలకనున్న టీఎస్ సీఎం

ఢిల్లీ పర్యటనకు నిన్న రాత్రే బయలుదేరి వెళ్లిన తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరికాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఈ మేరకు ప్రధాని వద్ద ప్రస్తావించాల్సిన అంశాలను కేసీఆర్ మరోమారు పరిశీలించుకున్నారు. కేంద్ర బడ్జెట్ కు ముందు ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్... కొత్త రాష్ట్రం కింద తెలంగాణకు రావాల్సిన కేంద్రం నిధులు, ఆర్థిక సంఘం కింద అందే నిధులు, ప్రత్యేక ప్యాకేజీ తదితరాలపై మోదీతో చర్చించనున్నారు. అదే సమయంలో తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, ధర్మల్ పవర్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలకు హాజరుకావాలని కూడా ఆయన ప్రధానిని ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.

More Telugu News