Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సూపర్ పవర్' రోగమంటే ఇదే... స్విమ్మింగ్ పూల్ లో దిగిన పాపానికి గర్భవతులయ్యారు!

అవును... మీరు చదివింది నిజమే. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి చేసిన పని 16 మంది యువతులను ఒకేసారి గర్భవతులను చేసింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఫ్లోరిడాలో 13 నుంచి 17 ఏళ్ల వయసున్న బాలికలు ఒకేసారి గర్భవతులయ్యారు. విషయం ఆరా తీస్తే, వారు చేసిన తప్పేమీ లేదు. ఓ పార్టీకి వెళ్లి వెళ్లిన వారంతా అక్కడి స్విమ్మింగ్ పూల్ లో సేదదీరడం తప్ప! స్విమ్మింగ్ పూల్ కు, గర్భం దాల్చడానికి సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా? దాన్ని వైద్యులు కనిపెట్టారు లెండి. ఇంతకీ విషయం ఏమంటే, ప్రపంచంలోనే అరుదైన వ్యాధుల్లో 'స్పెర్మాఫోర్టిస్' అనేది కూడా ఒకటి. ఈ వ్యాధి సోకిన వారి వీర్యం సాధారణ పురుషులతో పోలిస్తే వేల రెట్లు అధిక నాణ్యతతో ఉంటుంది. వీర్య కణాల సంఖ్య కూడా అంతే భారీగా ఉంటుంది. పైగా ఈ కణాలకు వాటర్ రెసిస్టెన్స్ బలమూ ఉంటుందట. ఎక్కువ కాలం జీవించి ఉంటాయట. అటువంటి వ్యాధి ఉన్న ఎవరో గుర్తు తెలియని వ్యక్తి, సదరు స్విమ్మింగ్ పూల్ లో వీర్యస్ఖలనం వుంటాడని, దాని ఫలితంగానే అందులో దిగిన వారికి గర్భం వచ్చిందని తేల్చారు. తమ తప్పు లేకుండానే గర్భం దాల్చిన ఈ 16 మందిలో ఇద్దరు మాత్రం బిడ్డను కనేందుకే నిర్ణయించుకోగా, మిగతావారు మాత్రం అబార్షన్ వైపు మొగ్గు చూపారట.

More Telugu News