ఖేడ్ ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తా: హరీశ్ రావు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఖేడ్ ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తా: హరీశ్ రావు

మెదక్ జిల్లా నారాయణఖేడ్ లో గత కొన్నిరోజులుగా టీఆర్ఎస్ తరపున అన్నీ తానై ప్రచారం చేస్తున్న మంత్రి హరీశ్ రావు గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ఈ ఉపఎన్నికలో తాము తప్పకుండా గెలుస్తామని స్పష్టం చేశారు. ప్రజల స్పందనను బట్టే తానిలా చెబుతున్నానన్నారు. వరంగల్ ఎన్నికలోలా భారీ మెజారిటీ వస్తుందనుకుంటున్నానని చెప్పారు. ఖేడ్ ను తాను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. ఇక ప్రతిపక్షాలకు ఈ ఎన్నికలో డిపాజిట్లైనా దక్కుతాయా? లేదా? అనేది తెలియాలని ఎద్దేవా చేశారు. నారాయణఖేడ్ లో ప్రచారంలో భాగంగా నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో హరీశ్ మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు ప్రచారం చేసి వెళ్లిపోతారని, కానీ అభివృద్ధి చేసేది తామేనని తేల్చి చెప్పారు. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయలేకపోయారని, ఇకిప్పుడేం చేస్తారని వ్యాఖ్యానించారు.

More Telugu News