కాపులను బీసీల్లో చేరుస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదు: బీసీ నేత కృష్ణయ్య
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాపులను బీసీల్లో చేరుస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదు: బీసీ నేత కృష్ణయ్య

కాపులను బీసీల్లో చేరుస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కాపులను బీసీల్లో చేర్చాలంటే సశాస్త్రీయమైన అధ్యయనం జరగాలని సూచించారు. ముందుగా కాపుల వాస్తవ జనాభా ఎంతో నిగ్గుతేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం ప్రజాప్రతినిధులు, ఉద్యోగాలు, ప్రభుత్వ సౌకర్యాల్లో వారు అనుభవించేది ఎంత శాతం? అన్నది అధ్యయనం చేయాలని ఆయన సూచించారు. ఆ తరువాత ఇతర బీసీల సంఖ్యతో దానిని మదించాలని, అప్పుడు వారు అనుభవిస్తున్న సౌకర్యాలతో కాపులు అనుభవిస్తున్న సౌకర్యాలను కూడా మదించి నిగ్గుతేలిస్తే...బీసీల్లో కాపులను చేర్చడం సమంజసమా? కాదా? అన్నది తేలుతుందని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగ సవరణ లేకుండా రిజర్వేషన్లు సాధ్యం కాదన్న ఆయన, విధ్వంసం జరిగితే సౌకర్యాలు కల్పిస్తామంటే చాలా వర్గాలు విధ్వంసాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు.

More Telugu News