Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దానం రాజీనామాకు పీసీసీ ఆమోదం

గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దానం నాగేందర్ చేసిన రాజీనామాకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆమోదం తెలిపింది. పార్టీ అధిష్ఠానం సూచన మేరకు రాజీనామాను ఆమోదించినట్టు తెలిసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ దానం రెండు రోజుల కిందట రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయన తన రాజీనామా లేఖలను పంపించారు.

More Telugu News