శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించలేం: సుప్రీంకు తేల్చిచెప్పిన కేరళ సర్కారు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించలేం: సుప్రీంకు తేల్చిచెప్పిన కేరళ సర్కారు

ఓ వైపు మహారాష్ట్రలోని ప్రసిద్ధ ఆలయం శని సింగనాపూర్ లోకి మహిళల ప్రవేశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా, నిన్న కేరళ సర్కారు సుప్రీంకోర్టులో తన పాత వాదననే పునరుద్ఘాటించింది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి అనుమతించలేమని ఊమెన్ చాందీ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి తేల్చిచెప్పింది. వందల ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న మహిళల నిషేధాన్ని రద్దు చేసి సంప్రదాయానికి పాతర వేయలేమని కుండబద్దలు కొట్టింది. 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు మహిళలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశం నిషిద్ధం. శబరిమలలోకి మహిళల ప్రవేశానికి అనుమతించాలని 2007లో దాఖలైన పిటిషన్ పై నిన్న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో భాగంగా ఊమెన్ చాందీ ప్రభుత్వం సంప్రదాయానికే పెద్ద పీట వేయనున్నట్లు కోర్టుకు తేల్చిచెప్పింది.

More Telugu News