Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ద అన్ టోల్డ్ స్టోరీ'... 9/11 దాడులకు లాడెన్ ను పురిగొల్పింది ఈ సంఘటనే!

2001లో ఒసామా బిన్ లాడెన్ అమెరికా ట్విన్ టవర్స్ ను కూల్చివేతకు పురిగొల్పిన ఘటన బయటపడింది. 9/11 దాడిగా పేరుగాంచిన అమెరికాలోని ట్విన్ టవర్స్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చివేతకు లాడెన్ ను పురిగొల్పిన ఘటనపై 'ద అన్ టోల్డ్ స్టోరీ' అంటూ ఉగ్రవాద సంస్థకు చెందిన 'ఆల్ మస్రా' పత్రిక ఓ కథనం ప్రచురించింది. దీని ప్రకారం 217 మంది మృతికి కారణమైన ఈజిప్టు ఎయిర్ లైన్స్ ప్రమాదం లాడెన్ కు స్పూర్తినిచ్చింది. 1999లో ఈజిప్టు ఎయిర్ లైన్స్ కు చెందిన ఎయిర్ ఫ్లైట్ 990 లాస్ ఏంజిలెస్ నుంచి కైరోకు ప్రయాణిస్తూ అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయింది. ఈ ఘటనలో 217 మంది మృత్యువాతపడగా, అందులో సగం మంది అమెరికన్లే. ఇంజిన్ ఫెయిల్ కావడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఈజిప్టు అధికారులు తేల్చగా, అమెరికా దర్యాప్తు విభాగం కో పైలట్ జమీల్ ఆల్ బటౌటీ విమానాన్ని ఉద్దేశ్యపూర్వకంగా విమానాన్ని సముద్రంలో ముంచేశాడని తేల్చింది. ఈజిప్టు ఎయిర్ లైన్స్ క్రమశిక్షణకు వ్యతిరేకంగా అతనీ దారుణానికి తెగబడినట్టు తేల్చారు. ఈ వార్త 'ఆల్ మస్రా'లో చదవిన లాడెన్ అనవసరంగా నీట్లో ముంచేశాడని, భవనాన్ని ఎందుకు ఢీ కొట్టలేదని ఆవేశంతో ప్రశ్నించాడు. అప్పుడే ఒసామా బిన్ లాడెన్ కు విమానాలతో భవనాలను ఢీ కొట్టాలనే ఆలోచన వచ్చిందని 'ఆల్ మస్రా' వెల్లడించింది. అయితే లాడెన్ ఆలోచనకు అతని అనుచరుడు ఖలీద్ తన ఆలోచనను జోడిస్తూ, అమెరికా విమానాలతోనే అమెరికాను దెబ్బతీయాలని నిర్ణయించాడు. అందులో భాగంగా అమెరికా విమానాలను హైజాక్ చేసి లాడెన్ ఆలోచనను అమలు చేశారని 'ఆల్ మస్రా' వెల్లడించింది.

More Telugu News