ప్రేమను ఒక్క మాటలో చెప్పడం కష్టం: కత్రినా కైఫ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రేమను ఒక్క మాటలో చెప్పడం కష్టం: కత్రినా కైఫ్

ప్రేమను ఒక్క మాటలో వ్యక్తం చేయడం కష్టమని బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ పేర్కొంది. 'ఫితూర్' సినిమా ప్రమోషన్ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జీవితంలో ప్రేమకు చాలా విలువనిస్తానని చెప్పింది. ప్రేమ చాలా విలువైనదని చెప్పిన కత్రినా, తాను నటించిన మూడు ప్రేమకథా చిత్రాలు ఈ ఏడాది విడుదల కానున్నాయని తెలిపింది. ఆదిత్యరాయ్ కపూర్ తో నటించిన 'ఫితూర్' త్వరలో విడుదల కానుండగా, సిద్ధార్థ్ మల్హోత్రాతో 'బార్ బార్ దేఖో', రణ్ బీర్ కపూర్ తో కలిసి నటించిన 'జగ్గా జాసూస్' సినిమాలు విడుదల కానున్నాయని కత్రినా వెల్లడించింది. మూడూ విభిన్న నేపథ్యం కలిగిన ప్రేమ కధాచిత్రాలని కత్రినా వివరించింది. ఇలాంటి కథలు తనను వరించడం అదృష్టమని కత్రినా తెలిపింది.

More Telugu News