Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అసదుద్దీన్ ని నాన్ బెయిలబుల్ కేసులో అరెస్టు చేయాలి: కాంగ్రెస్ నేతల డిమాండ్

గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్లపై ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డితో విపక్షాలు సమావేశమయ్యాయి. ఈ సమావేశం సందర్భంగా ఎంఐఎం నేతల దాడులపై ఆయనకు ఫిర్యాదు చేశారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని నాన్ బెయిలబుల్ కేసుల్లో అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆయనపై బెయిలబుల్ కేసులు పెట్టడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. అల్లర్లు జరిగిన 3 డివిజన్లలో రీపోలింగ్ నిర్వహించాలని వారు ఈసీ నాగిరెడ్డిని కోరారు. ఆయనను కలిసిన వారిలో టీకాంగ్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి, ముఖేష్ గౌడ్, టీడీపీ నేత ఎల్.రమణ, బీజేపీ నేత లక్ష్మణ్ ఉన్నారు.

More Telugu News