Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయాలి: అఖిలపక్ష నేతలు

హైదరాబాద్ లో శాంతి భద్రతల అదుపులో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని చెప్పడానికి గ్రేటర్ ఎన్నికల సందర్భంగా నిన్న జరిగిన సంఘటనలే నిదర్శనమని..సెక్షన్ 8 అమలు చేయాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఈ విషయమై గవర్నర్ నరసింహన్ తక్షణం జోక్యం చేసుకోవాలని.. సెక్షన్ 8కు ఆదేశించాలని అఖిలపక్షనేతలు జానారెడ్డి, లక్ష్మణ్, ఎల్.రమణ, శివకుమార్ కోరారు. సెక్షన్ 8 అమలు చేయడం ద్వారా హైదరాబాద్ లో శాంతిభద్రతలను పరిరక్షించాలని వారు కోరారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ లను త్వరలో కలిసి రాష్ట్రంలో పరిస్థితులను వివరిస్తామని అన్నారు. కాగా, పాతబస్తీలోని పురానాపూల్ లో కాంగ్రెస్, మజ్లిస్ కార్యకర్తల ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసనసభలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ గాయపడ్డ విషయం తెలిసిందే.

More Telugu News