కంచే చేను మేస్తే...ఈ పోలీసు వ్యవహారం అలాంటిదే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కంచే చేను మేస్తే...ఈ పోలీసు వ్యవహారం అలాంటిదే!

బాధ్యతలు మరచిన పోలీసు ఎక్కడైనా ఒకేలా ఉంటాడని ఓ పోలీసు అధికారి ఇంగ్లండ్ లో నిరూపించాడు. వెస్ట్ డెర్బీలోని ఈటన్ రోడ్డు పోలీస్ స్టేషన్ లో నవంబర్ 6 రాత్రి విధుల్లో డేవిడ్ గిబ్సన్ ఉన్నారు. స్టేషన్ లో ఎవరికీ చెప్పకుండా తన కారు తీసుకుని టూబ్రూక్ లోని షీల్ ఏరియాకు వెళ్లాడు. అక్కడికి వేశ్యలు వస్తుంటారు. ఆ సమయంలో అటుగా వస్తున్న ఓ మహిళ అతని కంటబడింది. దీంతో ఆమెను అటకాయించి జరిమానా కట్టాలని డేవిడ్ గిబ్సన్ ఆదేశించాడు. దీంతో ఆందోళన చెందిన ఆ మహిళ తన దగ్గర డబ్బు లేదని, తనను వదిలేస్తే ఇంకెప్పుడూ ఇటువైపు రానని అభ్యర్థించింది. తాను చాలా మంచి పోలీస్ అధికారినని, అరెస్టు చేయకుండా, జరిమానా చేయకుండా వదిలేస్తే తన కోసం ఏం చేస్తావని డేవిడ్ ప్రశ్నించాడు. తర్వాత ఆమెను తన వాహనంలో ఏకాంత ప్రాంతానికి తీసుకెళ్లి తన కోరికను తీర్చుకున్నారు. అయితే, ఆయన కారు పార్క్ చేయడం, తర్వాత కారులో ఆమెను తీసుకెళ్లడం... ఇవన్నీ సీసీటీవీ పుటేజ్ లో రికార్డయ్యాయి. దీంతో, బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, కోర్టు ముందు ఆ పోలీసధికారిని హాజరుపరిచారు. దీనిపై డిఫెన్స్ లాయర్ వాదిస్తూ బాధితురాలి దుర్బలత్వాన్ని ఆసరాగా చేసుకున్న పోలీసు అధికారి, శారీరక వాంఛ తీర్చుకునేందుకు యూనిఫాంను వినియోగించుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని అందుకు అతనిని కఠినంగా శిక్షించాలని న్యాయస్థానానికి విన్నవించారు.

More Telugu News