మూన్నాళ్ల ముచ్చటే!... వైసీపీకి మంత్రి దేవినేని సోదరుడి రాజీనామా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మూన్నాళ్ల ముచ్చటే!... వైసీపీకి మంత్రి దేవినేని సోదరుడి రాజీనామా!

టీడీపీ సీనియర్ నేత, ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సోదరుడు దేవినేని ఛంద్రశేఖర్ ముచ్చట ఎంతోకాలం కొనసాగలేదు. సోదరుడితో విభేదించి వైసీపీ తీర్థం పుచ్చుకున్న చంద్రశేఖర్ ఆ పార్టీలో ఎంతోకాలం కొనసాగలేకపోయారు. కొద్దిసేపటి క్రితం ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించిన చంద్రశేఖర్, ఆ కారణంగానే వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు.

More Telugu News