Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముంబై అమ్మాయిలకు ఉగ్ర పాఠాలు చెప్పేందుకు స్వయంగా రంగంలోకి దిగిన అబూ బకర్!

బాంబులు ఎలా తయారు చేసుకోవాలి? వాటిని శరీరానికి ఎలా ధరించాలి? ఆత్మహత్య చేసుకుంటూ విధ్వంసం ఎలా సృష్టించాలి? వీటన్నింటినీ బోధించేందుకు ఐఎస్ఐఎస్ ఉగ్ర నేత అబూ బకర్ అల్ బాగ్దాదీ స్వయంగా రంగంలోకి దిగాడు. ముంబైలోని యువతను, అందునా అమ్మాయిలను ఆత్మహత్యా దళాలుగా మార్చే ప్రయత్నంలో భాగంగా ఆన్ లైన్ మాధ్యమంగా అబూ బకర్ ఉగ్ర పాఠాలు చెబుతున్నాడని ముంబై యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ఏటీఎస్) కనిపెట్టింది. ఆన్ లైన్లో వీడియో కాన్ఫరెన్సింగ్ విధానంలో ఈ పాఠాలు సాగుతున్నాయని, స్కైపీ వంటి వీడియో కాలింగ్ సాఫ్ట్ వేర్ లను వారు వాడుతున్నారని తాము కనుగొన్నట్టు తెలిపారు. ముంబై యువతకు అబూ బకర్ శిక్షణ ఇస్తున్నట్టు తెలిసిందని, ఇక శిక్షణ పొందుతున్న వారిని గుర్తించే పనిలో పడ్డామని తెలిపారు.

More Telugu News