Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రష్యాలో భారీ భూకంపం... రిక్టర్ స్కేలుపై 7.0గా నమోదు

రష్యా తూర్పు ప్రాంతంలో ఇవాళ ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్ర 7.0గా నమోదైంది. రష్యాలోని యోలిజోవో పట్టణానికి 95 కిలో మీటర్ల దూరంలో 160 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే గుర్తించింది. అయితే భూకంప ధాటికి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం అందలేదని పేర్కొంది. అయితే సునామీ హెచ్చరికలు లేవని నేషనల్ అండ్ పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది.

More Telugu News