తెలుగు వర్సిటీ మాజీ వీసీ నాయిని కృష్ణకుమారి కన్నుమూత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలుగు వర్సిటీ మాజీ వీసీ నాయిని కృష్ణకుమారి కన్నుమూత

ప్రముఖ సాహితీవేత్త, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వీసీ నాయిని కృష్ణకుమారి కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా హైదరాబాద్ లోని ఆమె నివాసంలో తుదిశ్వాస విడిచారు. కృష్ణకుమారి తండ్రి ప్రముఖ కవి నాయిని సుబ్బారావు. తెలుగు జానపద సాహిత్యంలో ఆమె విశేష కృషి చేశారు. ఆమె మృతి పట్ల ఏపీ సీఎం చంద్రంబాబు సంతాపం తెలిపారు. తెలుగు సాహితీ వికాసానికి ఆమె ఎనలేని సేవలు చేశారని, గొప్ప సాహితీ విమర్శకురాలని కొనియాడారు. తెలుగు సంస్కృతిపై ఎన్నో పరిశోధనలు చేసిన కృష్ణకుమారి, పలు పరిశోధనలకు కూడా నేతృత్వం వహించారని పేర్కొన్నారు. కాగా ఎల్లుండి పంజాగుట్ట శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.

More Telugu News