స్వచ్ఛ భారత్ లో కొత్త కార్యక్రమం... 'స్టాచ్యూ క్లీనింగ్'కు పిలుపునిచ్చిన మోదీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్వచ్ఛ భారత్ లో కొత్త కార్యక్రమం... 'స్టాచ్యూ క్లీనింగ్'కు పిలుపునిచ్చిన మోదీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు మరో కొత్త కార్యక్రమంతో పిలుపునిచ్చారు. స్వచ్ఛ భారత్ లో భాగంగా విగ్రహ శుభ్రత('స్టాచ్యూ క్లీనింగ్') చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ పాల్గొనాలని కోరారు. ఇందుకోసం సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విట్టర్లో ఓ హ్యాష్ ట్యాగ్ ను కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ తమ దగ్గర్లోని జాతి గర్వించదగ్గ మహనీయుల విగ్రహాలను శుభ్రం చేసి, ఆ ఫోటోను #statuecleaning ద్వారా ట్వీట్ చేయాలని కోరారు. రానున్న రోజుల్లో అందులో కొన్నింటిని తన ట్విట్టర్ ద్వారా రీట్వీట్ చేస్తానని మోదీ తెలిపారు.

More Telugu News