'ఈనాడు' రామోజీరావు, సినీ నటుడు రజనీకాంత్ లకు పద్మవిభూషణ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఈనాడు' రామోజీరావు, సినీ నటుడు రజనీకాంత్ లకు పద్మవిభూషణ్

పలు రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు '2016- పద్మ' పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా పాత్రికేయరంగంలో సేవలకుగాను 'ఈనాడు' రామోజీరావు, ప్రముఖ సినీనటుడు రజనీకాంత్, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రవిశంకర్, ప్రముఖ సంగీత విద్వాంసురాలు గిరిజాదేవి, ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి తదితరులకు పద్మవిభూషణ్ పురస్కారాలను ప్రకటించారు. వైద్యరంగంలో సేవలకు విశ్వనాథన్ శాంతకు, ప్రజాసేవల రంగంలో మాజీ గవర్నర్ జగ్ మోహన్ కు, విద్య, సాహిత్య రంగంలో అవినాష్ దీక్షిత్ ఈ పురస్కారాలను అందుకోనున్నారు. కాగా, ధీరూబాయ్ అంబానీకి మరణానంతరం పద్మవిభూషణ్ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

More Telugu News