అంతరిక్షంలో పెరుగుతున్న వ్యర్థాలు... కొత్త ప్రమాదాలు వస్తాయంటున్న రష్యా శాస్త్రవేత్తలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అంతరిక్షంలో పెరుగుతున్న వ్యర్థాలు... కొత్త ప్రమాదాలు వస్తాయంటున్న రష్యా శాస్త్రవేత్తలు

అంతరిక్షంలో వ్యర్థాలపై రష్యా శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అమెరికా, రష్యా స్పేస్ ఏజెన్సీలు అంతరిక్షంలో భారీ వ్యర్థాలను గుర్తించాయని మాస్కోలోని రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులు తెలిపారు. అందులో అంతరిక్ష వ్యర్థాలలో 10 సెంటీమీటర్ల కంటే పెద్దగా ఉన్న కొన్నివేల శకలాలు ఉన్నట్టు గమనించారని వెల్లడించారు. వివిధ దేశాలు పంపిన శాటిలైట్ లను ఈ శకలాలు ఢీకొంటే గనుక వాటికి తీవ్ర నష్టం వాటిల్లవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఒకవేళ ఏదైనా దేశం పంపిన ముఖ్యమైన మిలటరీ శాటిలైట్ ఈ అంతరిక్ష వ్యర్థాల వలన ధ్వంసమైతే ప్రత్యర్థి దేశాల వారు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని భావిస్తారని చెబుతున్నారు. అది దేశాల మధ్య యుద్ధాలకు దారితీసే అవకాశం ఉంటుందని రష్యన్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 2007 లో చైనా తమ దేశానికి చెందిన కాలం చెల్లిన ఓ వాతావరణ శాటిలైట్ ను ధ్వంసం చేసింది. దాంతో మూడువేలకు పైగా శకలాలు అంతరిక్షంలో మిగిలిపోయాయి. ఈ క్రమంలో 2013లో రష్యాకు చెందిన బ్లిట్స్ శాటిలైట్ ను అంతరిక్ష వ్యర్థాలు ఢీ కొనడంతో ధ్వంసమైంది. పైన చైనా శాటిలైట్ ధ్వంసంలో ఏర్పడిన శకలాలే తమ శాటిలైట్ ధ్వంసానికి కారణమంటూ రష్యా ఆరోపిస్తోంది.

More Telugu News