‘చీపురు పట్టిన మోదీ’ ఫొటో ఫేకేనట!... ఆర్టీఐ దరఖాస్తుకు కేంద్రం రిప్లై
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘చీపురు పట్టిన మోదీ’ ఫొటో ఫేకేనట!... ఆర్టీఐ దరఖాస్తుకు కేంద్రం రిప్లై

గడచిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగిన నరేంద్ర మోదీ ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కించారు. ‘పోల్ మ్యాన్’ ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో రూపొందిన సదరు ప్రచారమంతా సోషల్ మీడియాలోనే సాగింది. సోషల్ మీడియాతో పాటు ఇతర మాధ్యమాల్లోనూ నాడు బీజేపీ సరికొత్త రీతిలో ప్రచారాన్ని హోరెత్తించింది. ఈ క్రమంలో 1988లో ఆరెస్సెస్ కార్యాలయంలో ఉన్న సమయంలో నరేంద్ర మోదీ చీపురు పట్టి ఊడ్చారని చెబుతూ ఓ ఫొటో వచ్చేసింది. దేశవ్యాప్తంగా అన్ని పత్రికలు ఆ ఫొటోను పతాక శీర్షికల్లో ప్రచురించాయి. ఈ ఫొటోపై పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. వినూత్న రీతిలో జరిగిన నాటి ప్రచారంలో మోదీ విజయఢంకా మోగించారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కేంద్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా ‘చీపురు పట్టిన మోదీ’ ఫోటో నకిలీదేనని తేలిపోయింది. ఈ మేరకు స్వయంగా కేంద్ర ప్రభుత్వమే సమాచార హక్కు చట్టం కింద అహ్మదాబాదుకు చెందిన ఉద్యమకర్త దాఖలు చేసిన ఓ దరఖాస్తుకు సమాధానమిస్తూ సదరు ఫొటోను... మార్ఫింగ్ చేసిన ఫొటోగా తేల్చేసింది.

More Telugu News