నా సినిమాలు పవన్ కల్యాణ్ ఇంకా చూడలేదు: సాయి ధరమ్ తేజ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా సినిమాలు పవన్ కల్యాణ్ ఇంకా చూడలేదు: సాయి ధరమ్ తేజ్

‘నా సినిమాలేవీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చూడలేదు’ అని ప్రముఖ హీరో సాయి ధరమ్ తేజ్ చెప్పాడు. ‘మీ సినిమాలు చూసిన తర్వాత పవన్ కల్యాణ్ ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏదీ?’ అన్న ప్రశ్నకు సాయిధరమ్ సమాధానమిస్తూ, ‘పవన్ కల్యాణ్ గారు నా సినిమాలేవీ ఇంకా చూడలేదు. ఆయనకు కుదరలేదు. కొంచెం బిజీగా ఉండటం వల్ల చూడలేకపోతున్నానని చెప్పారు. తాను చూడాలనుకున్నప్పుడు చెబుతానని అన్నారు. నా సినిమాల ట్రైలర్స్ మాత్రం ఆయన చూశారు’ అని తన మామ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి సాయిధరమ్ చెప్పాడు.

More Telugu News