Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మన జీవితం మనం తయారు చేసుకున్నది కాదు: మోదీ

అందరూ అనుకుంటున్నట్టు మన జీవితం మనం తయారు చేసుకున్నది కాదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. లక్నోలోని అంబేద్కర్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనం ప్రస్తుతం అనుభవిస్తున్న జీవితం ఎందరో మనుషుల త్యాగఫలితమని అన్నారు. మనం నిజాయతీగా గతాన్ని చూసుకుంటే అందులో మన ఉన్నతికి కష్టపడ్డ వ్యక్తులు ఎందరో తారసపడతారని ఆయన తెలిపారు. దేశం కోసం అంబేద్కర్ జీవితాన్ని త్యాగం చేశారని ఆయన తెలిపారు. రాజ్యాంగంలో ఎలాంటి తప్పులు లేకుండా రాయగలిగారంటే ఆయన సామర్థ్యం ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలని ఆయన తెలిపారు. దేశాన్ని విద్య మాత్రమే మార్చగలదని మనసావాచా నమ్మిన వ్యక్తి అంబేద్కర్ అని ఆయన చెప్పారు. అంబేద్కర్ జీవితాన్ని తరచి చూస్తే ఎలాంటి లోపమూ కనబడదని ఆయన పేర్కొన్నారు. దేశ భవిష్యత్ కు ఏది మంచి? ఏది చెడు? అన్న విషయాన్ని ఆనాడే ఆయన నిర్దేశించారని ఆయన తెలిపారు. ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్య ఫలం ఆనాటి అమరవీరుల త్యాగఫలమని ఆయన వివరించారు.

More Telugu News