హైదరాబాదులో నలుగురు ఉగ్రవాదుల అరెస్ట్... ఢిల్లీలోనూ ముగ్గురిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాదులో నలుగురు ఉగ్రవాదుల అరెస్ట్... ఢిల్లీలోనూ ముగ్గురిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

గణతంత్ర వేడుకలపై విరుచుకుపడతామని చెప్పిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు... భారీ ప్రణాళికనే రచించుకున్నట్లుంది. ఇప్పటికే దేశంలోకి అడుగుపెట్టారని భావిస్తున్న ఉగ్రవాదుల కోసం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు ముమ్మర సోదాలు చేస్తున్నారు. నేటి ఉదయం కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇద్దరు ఉగ్రవాదులను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు అరెస్ట్ లు జరిగిన గంటల వ్యవధిలో హైదరాబాదులోనూ ఎన్ఐఏ అధికారులు పలు ప్రాంతాలను జల్లెడ పట్టారు. ఎట్టకేలకు తమకు అందిన సమాచారం మేరకు ఉగ్రవాదులుగా భావిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఢిల్లీలోనూ ఎన్ఐఏ అధికారులు ముమ్మరంగా సోదాలు చేసి ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ లతో ఉగ్రవాదుల భారీ కుట్రకు చెక్ పడినట్టేనన్న భావన వినిపిస్తున్నా, దేశంలోకి మరింత మంది ఉగ్రవాదులు వచ్చారన్న సమాచారంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.

More Telugu News