'యవ్వనపు ఆత్రం' అంటూ అత్యాచారం కేసు కొట్టేసిన ఢిల్లీ కోర్టు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'యవ్వనపు ఆత్రం' అంటూ అత్యాచారం కేసు కొట్టేసిన ఢిల్లీ కోర్టు

అత్యాచార కేసుల్లో శిక్షలు సరిపోవడం లేదని, మరింత కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ పెరుగుతున్న వేళ, రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తిని ఢిల్లీ కోర్టు విడుదల చేసింది. బాధితురాలితో అతని సంబంధం 'యవ్వనపు ఆత్రం'గా అభివర్ణించారు అదనపు సెషన్స్ జడ్జ్ వీరేంధ్ర భట్. ఈ కేసులో బాధితురాలిగా ఉన్న యువతి, నిందితుడు వికూ బక్ష్ తమ కోరికలను ఆపుకోలేక దగ్గరైనట్టు తెలుస్తోందని, దీన్ని అత్యాచారంగా ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటికీ, వారిద్దరి మధ్యా సామాజిక మాధ్యమాల్లో కొనసాగిన సంభాషణలు పరిశీలిస్తే, ఆమె కూడా అతనితో లైంగిక బంధానికి ఆసక్తి చూపినట్టు స్పష్టమవుతోందని అన్నారు. కాగా, ఈ కేసులో తనను వివాహం చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడని, ఆపై వివాహం చేసుకోలేదని యువతి ఫిర్యాదు చేయగా, వికూబక్ష్ పై ఐపీసీ 376, 506 కింద పోలీసులు కేసులు పెట్టారు. కేసు విచారించిన న్యాయస్థానం ఇద్దరూ తమ బంధాన్ని ఆనందించారని స్పష్టమవుతోందని, ఈ కేసులో నిందితుడిని తప్పుబట్టలేమని పేర్కొంది.

More Telugu News