‘ఆల్ ప్రాక్స్’ ఓవర్ డోస్ తోనే సునంద చనిపోయింది!... తేల్చిచెప్పిన ల్యాబ్ రిపోర్ట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘ఆల్ ప్రాక్స్’ ఓవర్ డోస్ తోనే సునంద చనిపోయింది!... తేల్చిచెప్పిన ల్యాబ్ రిపోర్ట్

కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ చనిపోవడానికి గల కారణం ఎట్టకేలకు తెలిసిపోయింది. నిద్ర లేమి నివారణ కోసం కొంతమంది వినియోగించే ‘ఆల్ ప్రాక్స్’ మందు కారణంగానే సునంద చనిపోయిందట. ‘ఆల్ ప్రాక్స్’ మోతాదు మితి మీరిన కారణంగానే ఆమె చనిపోయిందని ఇటీవల పోలీసులకు అందజేసిన నివేదికలో అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ) తేల్చిచెప్పింది. అయితే ఆల్ ప్రాక్స్ ను సునందే స్వయంగా తీసుకున్నారా? లేక ఎవరైనా ఆమె శరీరంలోకి ఇంజెక్ట్ చేశారా? అన్న విషయం మాత్రం ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. రెండేళ్ల క్రితం న్యూఢిల్లీలోని ఓ విలాసంతమైన హోటల్ గదిలో సునంద విగత జీవిగా కనిపించారు. నాడు శశి థరూర్ కేంద్ర మంత్రి హోదాలోనే ఉన్నారు. సునంద అనుమానాస్పద మరణం నాడు కలకలం రేపింది.

More Telugu News