మా అభ్యర్థులు 92 మంది: టీ-టీడీపీ అధ్యక్షుడు రమణ
గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున 92 మంది అభ్యర్థులకు బీఫారాలు అందజేశామని టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ తెలిపారు. ఎన్నికల కమిషన్ ను కలిసిన సందర్భంగా పార్టీ బీఫారాలు అందజేసిన 92 మంది జాబితాను అధికారులకు అందజేశారు. పొత్తుల్లో భాగంగా 87 స్థానాల్లోనే అభ్యర్థులను పోటీకి నిలబెట్టాల్సి ఉండగా, 92 మందికి బీఫారాలు అందజేయడం విశేషం. అదే సమయంలో బీజేపీకి కేటాయించిన స్థానాలకు అదనంగా రెండు స్థానాలకు ఆ పార్టీ బీఫారాలు అందజేసింది. కాగా, రెండు పార్టీల నుంచి బీఫారాలు ఆశించిన వారు అవి దక్కకపోవడంతో బరిలో నిలుస్తామని ప్రకటించారు. దీంతో రెండు పార్టీలకు రెబల్స్ బెడద తప్పేలా లేదు.