రాజధాని మాస్టర్ ప్లాన్ పై అవగాహన సదస్సును అడ్డుకున్న తుళ్లూరు రైతులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజధాని మాస్టర్ ప్లాన్ పై అవగాహన సదస్సును అడ్డుకున్న తుళ్లూరు రైతులు

గత కొన్ని రోజుల నుంచి రాజధాని మాస్టర్ ప్లాన్ పై రాజధాని ప్రాంతంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ రోజు గుంటూరు జిల్లా తుళ్లూరులో జరుగుతున్న అవగాహన సదస్సును రైతులు అడ్డుకున్నారు. సీఆర్ డీఏ కమిషనర్ వచ్చి తమ సందేహాలను నివృత్తి చేయాలని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ వచ్చేవరకు సమావేశాన్ని ఆపాలని రైతులు స్పష్టం చేశారు. దాంతో అధికారులు సదస్సును నిర్వహించే అవకాశం లేకుండాపోయింది. కాగా నేటితో రాజధాని మాస్టర్ ప్లాన్ పై అవగాహన సదస్సులు ముగుస్తున్నాయి.

More Telugu News