అసెంబ్లీ ప్రతిష్టను దిగజారుస్తున్నారు: మండిపడిన వైసీపీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అసెంబ్లీ ప్రతిష్టను దిగజారుస్తున్నారు: మండిపడిన వైసీపీ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. సమావేశాలను ప్రవేటు స్థలాల్లో నిర్వహిస్తామని చెప్పి అసెంబ్లీ ప్రతిష్టను దిగజారుస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశాలను హాయ్ ల్యాండ్ లో, ప్రైవేటు యూనివర్సిటీల్లో నిర్వహిస్తామని ప్రకటనలు చేయడం దారుణమని అన్నారు. అసెంబ్లీ గౌరవాన్ని కాపాడాలని, ప్రైవేటు స్థలాల్లో అసెంబ్లీ నిర్వహిస్తే భద్రత ఎలా కల్పిస్తారని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆరోగ్యమిత్ర కార్యకర్తలను తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నట్టు తెలిపారు.

More Telugu News