దావోస్ సదస్సులో ముఖ్య అతిథిగా చంద్రబాబు, హాజరైన బజాజ్, మిట్టల్, పిరామల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దావోస్ సదస్సులో ముఖ్య అతిథిగా చంద్రబాబు, హాజరైన బజాజ్, మిట్టల్, పిరామల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే ఏకైక లక్ష్యంగా దావోస్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశమయ్యారు. ఇక్కడ జరుగుతున్న ఇండియన్ కమ్యూనిటీ సదస్సుకు ప్రత్యేక అతిథిగా చంద్రబాబు హాజరుకాగా, వ్యాపారవేత్తలు బజాజ్ గ్రూప్ సంస్థల అధిపతి రాహుల్ బజాజ్, భారతీ ఎంటర్ ప్రైజస్ చైర్మన్ సునీల్ మట్టల్, పిరామల్ గ్రూప్ సంస్థల ఎండీ అజయ్ పిరామల్, ఇన్ఫోసిస్ సీఈఓ విశాల్ శిక్కా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబు ప్రసంగిస్తూ, పెట్టుబడులు పెట్టడానికి అనువైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, ఇన్వెస్ట్ మెంట్లతో వచ్చే వారికి అవసరమైన అన్ని అనుమతులను, మౌలిక వసతులనూ సత్వరమే కల్పించేందుకు చర్యలు చేపట్టనున్నామని వివరించారు. సింగిల్ డెస్క్ విధానం ద్వారా కంపెనీలకు 21 రోజుల్లోనే అనుమతులిస్తున్నామని గుర్తు చేశారు. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి పుష్కలంగా అవకాశాలున్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిని హరిత, జలవనరుల నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

More Telugu News