కేసీఆర్ సార్ ఒకేసారి వంద జతలు కుట్టిస్తారు!: సాయి ఖాదీ భండార్ యజమాని
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేసీఆర్ సార్ ఒకేసారి వంద జతలు కుట్టిస్తారు!: సాయి ఖాదీ భండార్ యజమాని

‘కేసీఆర్ సార్ వంద ప్యాంట్లు..వంద షర్టులు ఒకేసారి కుట్టిస్తారు’ అని హైదర్ గూడలోని సాయి ఖాదీ భండార్ యజమాని చెప్పారు. 1990 ప్రాంతం నుంచి కేసీఆర్ ఈ షాపులోనే బట్టలు కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఆయన ఇక్కడికి వచ్చారు. ఖాదీ దుస్తులను ఆయన కొనుగోలు చేశారు. అనంతరం ఈ షాపు యజమాని మాట్లాడుతూ, ‘మా దగ్గరకు కేసీఆర్ సార్ సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నారు. ఎప్పుడొచ్చినా వంద జతలు కుట్టిస్తారు. వంద ప్యాంట్లు, వంద షర్టులు కుట్టిస్తారు. ఎక్కువ శాతం ఖాదీ వస్త్రాలనే ఆయన కుట్టిస్తారు. 1984 నుంచి కేసీఆర్ సార్ నాకు పరిచయం. 1984 నుంచి మా వద్దే స్టిచింగ్ చేయించుకుంటున్నారు. 1990 నుంచి క్లాత్ కూడా ఇక్కడే కొనుగోలు చేస్తున్నారు" అని చెప్పారు.

More Telugu News