రణబీర్, కత్రినా కైఫ్ బంధం ముగిసిందట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రణబీర్, కత్రినా కైఫ్ బంధం ముగిసిందట!

బాలీవుడ్ నటులు రణ్ బీర్ కపూర్, కత్రినా కైఫ్ మధ్య ఉన్న బ్రేకప్ జరిగినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ కథనాల ప్రకారం వారిద్దరూ విడిపోయారని సమాచారం. రణ్ బీర్ కపూర్ తో కత్రినా కైఫ్ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందని, వారి కుటుంబం కూడా వీరి వివాహానికి సమ్మతించిందని, వారు సహజీవనం మొదలు పెట్టేశారని నిన్నటి వరకు బాలీవుడ్ లో వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హాలిడే వెకేషన్ సందర్భంగా వీరిద్దరూ ఏకాంతంగా గడిపిన ఫోటోలు కూడా బయటకువచ్చాయి. అయితే వారిద్దరూ తాజాగా విడిపోయారని బాలీవుడ్ భోగట్టా. రణ్ బీర్ ఫ్లాట్ నుంచి కత్రినా లగేజీ సర్దుకుని వెళ్లిపోయిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫితూర్ సినిమా ప్రమోషన్ లో ఆమె మాట్లాడుతూ, రణ్ బీర్ ఓ రిలేషన్ షిప్ కి కట్టుబడే వ్యక్తి కాదని చెప్పింది. రణ్ బీర్ తన నిర్ణయాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటాడని ఆమె పేర్కొంది. రణ్ బీర్ తో విడిపోయినప్పుడు దీపికా పదుకొనే కూడా ఇదే అభిప్రాయాన్ని పేర్కొనడం విశేషం. కాగా, వీరి బ్రేకప్ కి సల్మాన్ ఖాన్ కారణమని మరోపక్క వార్తలు వినిపిస్తున్నాయి.

More Telugu News