పాములతో విన్యాసాలు చేసిన బీహార్ విద్యామంత్రి
బీహార్ విద్యాశాఖ మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ చౌదరికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫొటోల్లో మంత్రిగారి మెడలో పాములు వేసుకుని దర్శనమిస్తున్నారు. రెండేసి పాములను వేసుకుని మరీ ఫొటో తీయించుకున్నారు. మకర సంక్రాంతి సందర్భంగా తన వద్దకు వచ్చిన కార్యకర్తలకు ఈ వేషంలో మంత్రిగారు నాగ దేవత ఆశీర్వాదాలు అందజేశారు. కాగా మంత్రివర్యుల చర్యలు వివాదాస్పదమయ్యేలా కనిపిస్తున్నాయి.