సెంట్రల్ యూనివర్సిటీలో సస్పెండ్ అయిన విద్యార్థి సూసైడ్
హైదరాబాదులోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో గుంటూరుకు చెందిన ఓ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. సైన్స్ అండ్ టెక్నాలజీలో పీహెచ్డీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వేముల రోహిత్ (28) ఎన్ఆర్ఎన్ హాస్టల్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యూనివర్సిటీలోని విద్యార్థి సంఘాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో ఐదుగురు విద్యార్థులను యూనివర్సిటీ అధికారులు సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ గత 14 రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. అయితే యూనివర్సిటీ అధికారులు వారిని ఏమాత్రం పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురైన రోహిత్ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.