మహిళను కాల్చి...ఆత్మహత్య చేసుకున్న పోలీసు
ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ద్వారకకు చెందిన విజేందర్ అనే వ్యక్తి రన్ హోలా పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నాడు. విజేందర్ కు గతంలో ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉండేది. దీంతో ఆమె భార్య అతనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతనిని బదిలీ చేసిన ఉన్నతాధికారులు, దీనిపై విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆ మహిళను విజేందర్ కలిశాడు. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై చర్చించుకున్న తరువాత విజేందర్ ఆమెను సర్వీసు తుపాకీతో కాల్చాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే విజేందర్ కూడా కాల్చుకున్నాడు. దీనిని గమనించిన స్థానికులు ఆయనను హుటాహుటీన ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆయన మృతిచెందాడు.