పంచెలు కట్టి, చొక్కాలు పైకి మడుస్తూ అతివల సంబరాలు!
సంక్రాంతి పర్వదినాన్ని వైవిధ్యంగా జరుపుకోవాలన్న ఆ యువతులు సరికొత్తగా ఆలోచించారు. తమిళనాడులోని కోవై ఎస్ఎన్ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో యువతులు పంచెలు కట్టి, చొక్కాలు ధరించి సందడి చేశారు. ఘనంగా సంక్రాంతి పండగను జరుపుకున్నారు. చొక్కా చేతులను పైకి మడతలు పెట్టి వేడుకలను చేసుకుంటున్న అమ్మాయిల సందడి అందరినీ అలరించింది. కళాశాలలో ముగ్గుల, పిండి వంటల పోటీలు, ఆపై సంప్రదాయ దుస్తుల ఫ్యాషన్ షో తదితరాలు విద్యార్థినుల కేరింతల మధ్య జరిగాయి.