గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కొత్త వ్యూహం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కొత్త వ్యూహం!

గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఓ సమస్య వేధిస్తోంది. టీఆర్ఎస్ ఇప్పటికే తన అభ్యర్థులను ప్రకటించి, నామినేషన్లు కూడా వేయించింది. అదే సమయంలో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించలేదు. కానీ, ఆ మూడు పార్టీల తరపున గ్రేటర్ ఎన్నికల్లో ఆయా అభ్యర్థులు నామినేషన్లు వేయడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అభ్యర్థుల పేర్లను మీడియాలో ప్రకటించకుండా ఆ మూడు పార్టీలు ఈ సారి కాస్త గోప్యం పాటించడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. దీనికి కారణం వుంది. గత ఎన్నికల సందర్భంగా ముందుగా ఈ మూడు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగా, టీఆర్ఎస్ పార్టీ నేతలు రంగంలోకి దిగి ఆయా అభ్యర్థులతో బేరసారాలు సాగించి, వారి నుంచి నామినేషన్లు ఉపసంహరించేలా చేశారు. అలా నామినేషన్లు ఉపసంహరించని నేతల నియోజకవర్గాల్లో అసంతృప్తులను, తిరుగుబావుటా ఎగురవేసిన వారిని ప్రోత్సహించి సునాయాసంగా విజయం సాధించింది. అలా తమ పార్టీకి ఎదురులేకుండా చేసుకుని తెలంగాణలో సత్తాచాటింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈసారి అభ్యర్థుల జాబితా ప్రకటించకుండానే, ఫోన్ ద్వారా పార్టీ నేతలకు సమాచారం అందించి నామినేషన్లు వేయించారు. దీంతో టీఆర్ఎస్ నుంచి 277 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, బీజేపీ నుంచి 93 మంది, టీడీపీ నుంచి 187 మంది, కాంగ్రెస్ నుంచి 200 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో టీఆర్ఎస్ తో బేరసారాలు కుదిరితే వెళ్లిపోయేవారిని పక్కనపెట్టి, మిగిలిన వారి నామినేషన్లు కొనసాగించాలనే ఆలోచనలో ఆ మూడు పార్టీలు ఉన్నట్టు తెలుస్తోంది.

More Telugu News