అమరావతిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి టెండర్లు: నారాయణ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి గ్లోబల్ టెండర్లు ఆహ్వానిస్తున్నట్టు మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, టెండర్ల దాఖలుకు 21 రోజుల సమయమిచ్చినట్టు తెలిపారు. గడువు పూర్తైన ఐదు రోజుల్లోనే టెండర్లను ఖరారు చేస్తామని ఆయన చెప్పారు. నాలుగు నెలల్లో తాత్కాలిక సచివాలయ నిర్మాణం పూర్తి చేయాలనేది ప్రణాళిక అని ఆయన తెలిపారు. సీడ్ క్యాపిటల్ పరిధిలో రైతులకు సమీపంలోనే భూములు కేటాయిస్తామని ఆయన చెప్పారు. డ్రాఫ్ట్ ప్లాన్ పై ఈ నెల 25 వరకు అభ్యంతరాల స్వీకరణ జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.