నేతాజీ విమాన ప్రమాదంలోనే మరణించారు...యూకే వెబ్ సైట్ కథనం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేతాజీ విమాన ప్రమాదంలోనే మరణించారు...యూకే వెబ్ సైట్ కథనం

ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలోనే మృతి చెందారని పేర్కొంటూ యూకేకి చెందిన వెబ్ సైట్ వివరాలతో పాటు వెల్లడించింది. 1945 ఆగస్టు 18వ తేదీ అర్ధరాత్రి తైవాన్ రాజధాని తైపీ శివార్లలో ఓ విమానప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన సన్నిహితుడు కల్నల్ హబిబర్ రెహ్మాన్ ఖాన్ కూడా ఉన్నారు. తీవ్రంగా గాయపడ్డ చంద్రబోస్ ను స్థానిక ఆసుపత్రికి తరలించగా, కాసేపటికే ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. కోమాలోకెళ్లిన కాసేపటికి ఆయన మృత్యువాత పడ్డారు. కాసేపట్లో మరణిస్తారనగా బోస్ తనకు ఆంగ్ల అనువాదకుడ్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా దేశం కోసం పోరాడుతూ ప్రాణాలొదిలానని భారత్ కు తెలియజేయాలని ఆయన కోరారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ సందర్భంగా ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వర్తించిన మహిళ నిర్ధారించినట్టు ఆ వెబ్ సైట్ కథనంలో పేర్కొంది. అలాగే హింద్ ఫౌజ్ ఎప్పటికీ సేవలందించాలని ఆయన కోరుకున్నట్టు ఆయన సన్నిహితుడు రెహ్మాన్ ఖాన్ ప్రకటన విడుదల చేశారు. దీంతో ఆజాద్ హింద్ ఫౌస్ వ్యవస్థాపకుడు విమాన ప్రమాదంలోనే మృత్యువాత పడినట్టు తెలుస్తోందని సదరు వెబ్ సైట్ కధనంలో పేర్కొంది.

More Telugu News