నేటి 'అంకుర భారత్'లో మోదీ ఏం చెప్పనున్నారు?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేటి 'అంకుర భారత్'లో మోదీ ఏం చెప్పనున్నారు?

ప్రధాని నరేంద్రమోదీ ‘అంకుర భారత్‌’(స్టార్టప్ ఇండియా)పథకాన్ని నేడు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా వ్యాపారవేత్తల్ని ప్రోత్సహించే కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఈ సందర్భంగా లక్ష అంకురాలు ఏర్పటయ్యే అవకాశముందని, 50వేల కోట్ల డాలర్ల సంపద సమకూరుతుందని కేంద్రం భావిస్తోంది. అలాగే దీని ద్వారా 35లక్షల మందికి ఉపాధి మార్గాలు లభిస్తాయని భావిస్తున్నారు. దేశంలో స్టార్టప్ లను ప్రోత్సహించే దిశగా అమెరికాలోని సిలికాన్ వ్యాలీ నుండి భారత్ వచ్చిన పెట్టుబడిదారులను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. దేశంలో స్టార్టప్ లను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి నిపుణుల సలహాలను కోరనున్నారు.

More Telugu News