ఒకే వేదికపైకి అరుణ్ జైట్లీ, రాహుల్ గాంధీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒకే వేదికపైకి అరుణ్ జైట్లీ, రాహుల్ గాంధీ!

అధికార, విపక్ష ముఖ్యనేతలుగా అవకాశం దొరికినప్పుడల్లా విమర్శించుకునే ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు ఒకే వేదికను పంచుకోనున్నారు. ఈ అరుదైన ఘటన ఫిబ్రవరి 3న బెంగళూరులో జరగనుండగా, భారత వ్యాపార వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కర్ణాటక ప్రభుత్వం, ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించే సదస్సులో వీరిద్దరూ కలవనున్నారు. కన్నడ నాట కాంగ్రెస్ సర్కారు అధికారంలో ఉండటంతో, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు రాహుల్ రాక ఖరారు కాగా, వ్యాపార సదస్సు కావడంతో జైట్లీ సైతం రానున్నారు. రాజకీయాలు పక్కనబెట్టి ఆర్థిక విధానాలు, దేశంలో వ్యాపార సరళిని చర్చించేందుకు ఇది సరైన వేదిక కాగలదని ఫెడరేషన్ అధ్యక్షుడు ఎస్ సంపత్ రామన్ వ్యాఖ్యానించారు. రెండు పార్టీలూ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాయని భావిస్తున్నట్టు తెలిపారు. కాగా, అరుణ్ జైట్లీతో పాటు రాహుల్ గాంధీ సదస్సు ప్రారంభోత్సవంలో పాల్గొననుండగా, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, వెంకయ్యనాయుడు, అశోక్ గజపతి రాజు, సురేష్ ప్రభు, అనంతకుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా రానున్నారని తెలుస్తోంది.

More Telugu News