Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎయిర్ పోర్టులో సంక్రాంతి మూడ్ ఎలావుందో చూపిన హీరో ఆది ట్వీట్

సంక్రాంతికి స్వస్థలాలకు వెళ్లే వారితో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు మాత్రమే కాదు, ఎయిర్ పోర్టు సైతం కిక్కిరిసి పోయింది. నేటి ఉదయం శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రవేశ ద్వారం వద్ద పరిస్థితి ఓ రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్ ను తలపించింది. ఇక సెలబ్రిటీలైనా లోనికి వెళ్లేందుకు క్యూలో వేచి చూడక తప్పనిసరి పరిస్థితి. తన తాజా చిత్రం 'గరం' రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న హీరో ఆది ఉదయం ఎయిర్ పోర్టుకు వెళ్లాడు. అక్కడి రద్దీని చూసి ఓ సెల్ఫీ దిగి, తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. విమానాశ్రయం సంక్రాంతి మూడ్ లో ఉందని ట్వీట్ చేశాడు. ఆ చిత్రాన్ని మీరూ చూడవచ్చు.

More Telugu News