బయటకు వచ్చాక తడాఖా చూపిస్తా!... సీఎం కూడా అడ్డుకోలేరు: హార్దిక్ పటేల్ సంచలన వ్యాఖ్య
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బయటకు వచ్చాక తడాఖా చూపిస్తా!... సీఎం కూడా అడ్డుకోలేరు: హార్దిక్ పటేల్ సంచలన వ్యాఖ్య

పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్ల కోసం ఉద్యమ బాట పట్టిన రోజుల వ్యవధిలోనే దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న గుజరాత్ యువ సంచలనం హార్దిక్ పటేల్ నేటి ఉదయం సంచలన వ్యాఖ్యలు చేశారు. జైలు నుంచి విడుదల కాగానే తడాఖా చూపిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ దఫా జరగనున్న ఆందోళనలను సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ కూడా అడ్డుకోలేరని ఆయన వ్యాఖ్యానించారు. గుజరాత్ లో పటేళ్లకు రిజర్వేషన్ల కోసం సాగించిన ఉద్యమం నేపథ్యంలో హార్దిక్ పటేల్ పై రెండు రాజద్రోహం కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ఆదేశాలతో సూరత్ జైలుకు తరలించారు. నేటి ఉదయం ఈ కేసుల విచారణ కోసం సూరత్ లోని ఓ కోర్టుకు హార్దిక్ ను పోలీసులు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా స్థానిక మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్లను సాధించే దాకా విశ్రమించేది లేదని గతంలోనే నిర్ణయించుకున్నానని వ్యాఖ్యానించిన హార్దిక్... జైలు నుంచి విడుదల కాగానే మలి విడత ఆందోళనలకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు. ఈ దఫా జరగనున్న ఉద్యమాన్ని తమ సామాజిక వర్గానికే చెందిన సీఎం ఆనందిబెన్ పటేల్ కూడా అడ్డుకోలేరని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

More Telugu News