అగ్రిగోల్డ్ పై సీబీఐ విచారణ కోరుతూ సుప్రీంలో కారెం శివాజీ పిటిషన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అగ్రిగోల్డ్ పై సీబీఐ విచారణ కోరుతూ సుప్రీంలో కారెం శివాజీ పిటిషన్

తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన అగ్రిగోల్డ్ భారీ కుంభకోణంపై మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ స్కాంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని అందులో కోరారు. దీనిపై న్యాయస్థానం ఇవాళ విచారణ జరిపింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరుగుతున్నందున అక్కడే వాదనలు వినిపించాలని పిటిషనర్ కు సూచించింది. కాగా ఈ వ్యవహారంలో అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకానికి హైకోర్టు అనుమతి తెలిపిన సంగతి తెలిసిందే.

More Telugu News