పోలీస్ స్టేషన్ లో ఘోరం...మహిళలను వివస్త్రలను చేసి...కారం చల్లి...హింసించారు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పోలీస్ స్టేషన్ లో ఘోరం...మహిళలను వివస్త్రలను చేసి...కారం చల్లి...హింసించారు!

పోలీసుల 'ట్రీట్మెంట్' ఎలా వుంటుందో పోలీస్ స్టేషన్ కి వెళ్లిన చాలామందికి తెలుస్తుంది. వారి విచారణ శైలిపై ఎన్నో ఆరోపణలు ఉన్నప్పటికీ, ఈ విషయంలో కోర్టులు ఎన్నిసార్లు చీవాట్లు పెడుతున్నప్పటికీ వారి ప్రవర్తనలో మాత్రం మార్పు కనపడదు. ఓపక్క 'ఫ్రెండ్లీ పోలీసింగ్' అంటూ పేపర్లలో ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, కింది స్థాయి సిబ్బంది దారుణమైన హింసకు పాల్పడుతుంటారు. అలాంటి ఘటనే మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో చోటుచేసుకుంది. అయితే, ఇక్కడ అబలలపై పోలీసులు తమ పరాక్రమాన్ని ప్రదర్శించారు. వివరాల్లోకి వెళ్తే...నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు బాధితురాలు తన ఆరుగురు స్నేహితులతో (ఒక యువతి, ఐదుగురు యువకులు) కలిసి ఓ హోటల్ కు వెళ్లింది. ఈ పార్టీలో ఇద్దరు మహిళలూ తప్ప మిగిలిన వారంతా మద్యం తాగారు. మోతాదుకి మించి తాగిన ఓ యువకుడు అభ్యంతరకరంగా వ్యవహరించడంతో అర్ధరాత్రి సమయంలో ఆ యువకుడ్ని దేవగిరి కాలనీ ప్రాంతంలో వదిలి పెట్టి, ఆ ఇద్దరు మహిళలను వారివారి ఇళ్ల దగ్గర దింపేందుకు మిగతా స్నేహితులంతా వెళ్లారు. వారిని దించి వెనుదిరిగే సమయంలో వారంతా సెంట్రల్ బస్టాండ్ దగ్గరకెళ్లగా, అక్కడ దేవగిరి కాలనీలో దించేసిన యువకుడు ఎదురుపడ్డాడు. పార్టీ మొత్తాన్ని పాడుచేశాడని ఆరోపిస్తూ అతడిని వారంతా కలసి కొట్టారు. ఆ క్రమంలో అతను పరుగెడుతూ కిందపడ్డాడు. దాంతో తీవ్ర గాయాలయ్యాయి. అతనిని ఆసుపత్రికి తరలించేలోపే అతను మృతి చెందారు. దీనికి సీసీటీవీ పుటేజ్ సాక్ష్యం కూడా ఉంది. అయితే దీనిపై విచారణ పేరుతో ఇద్దరు మహిళలను ఎస్సై గణేష్ ఢొక్రాట్, మరో మహిళా ఎస్సై స్టేషన్ కు తీసుకెళ్లారు. అనంతరం వారిని రాయడానికి వీలుకాని భాషలో హింసపెట్టారు. అంతే కాకుండా వారిని వివస్త్రలను చేసి ప్రైవేటు పార్టులలో కారం చల్లారు. అనంతరం వారితో బలవంతాన వాంగ్మూలం తీసుకుని సాయంత్రం విడిచిపెట్టారు. దీంతో బాధిత మహిళల్లో ఓ యువతి (21) తన తల్లితో కలిసి పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమీషనర్ డిపార్ట్ మెంటల్ విచారణకు ఆదేశించారు. దీంతో ఆ ఇద్దరు ఎస్సైలు, కానిస్టేబుళ్లపై విచారణ జరుగుతోందని ఆయన వెల్లడించారు.

More Telugu News