Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టెలికాం సంస్థలకు వ్యతిరేకంగా వాదనలు వినిపించిన ట్రాయ్

టెలిఫోన్ వినియోగదారుల ప్రయోజనార్థం కాల్ డ్రాప్ అయితే వినియోగదారుడికి రూపాయి చెల్లించాలని ట్రాయ్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అలా చెల్లిస్తే తీవ్రంగా నష్టపోతామని పేర్కొంటూ టెలికాం సంస్థలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై ట్రాయ్ న్యాయస్థానంలో వాదనలు వినిపించింది. టెలికం ఆపరేటర్లు టవర్లను ఏర్పాటు చేయడంపై పెట్టుబడులు పెట్టకపోవడం వల్లే వినియోగదారులు కాల్ డ్రాప్ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని తెలిపింది. గతంలో కంటే ఇప్పుడు డేటా వాడకం గణనీయంగా పెరిగిందని, అయినప్పటికీ టవర్లను ఏర్పాటు చేయలేదని ట్రాయ్ ఆరోపించింది. ఇందువల్లే వినియోగదారుడు కాల్ డ్రాప్ సమస్య ఎదుర్కోవాల్సి వస్తోందని పేర్కొంది. ఈ మేరకు గణాంకాల వివరాల అఫిడవిట్ ను ట్రాయ్ న్యాయస్థానానికి దాఖలు చేసింది. దీనికి పరిష్కారంగా కాల్ డ్రాప్ అయితే వినియోగదారుడికి రూపాయి చెల్లించాలని ఆదేశించినట్టు తెలిపింది. ట్రాయ్ వాదనను జస్టిస్ రోహిణి, జస్టిస్ జయంత్ నాథ్ సారధ్యంలోని డివిజన్ బెంచ్ వింది.

More Telugu News