Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఐఎస్ దారుణం.. చిన్నారి దేహానికి పేలుడుపదార్థాలు కట్టి పేల్చేశారు!

ఐఎస్ఐఎస్ మరో దారుణానికి పాల్పడింది. ఐఎస్ ఉగ్రవాదులు నాలుగేళ్ల చిన్నారి దేహానికి పేలుడు పదార్థాలను కట్టి, వాటిని రిమోట్ ద్వారా పేల్చేసి, భయోత్పాతాన్ని సృష్టించారు. ఇరాక్ లోని అల్-షిర్కత్ జిల్లాలో ఇసాడేర్ అనే బాలుడి శరీరానికి పేలుడు పదార్థాలను ఐఎస్ ఉగ్రవాదులు అమర్చారు. అనంతరం రిమోట్ కంట్రోల్ ద్వారా పేల్చేశారు. కాగా, ఈ సంఘటన జరగడానికి వారం రోజుల ముందు బాలుడి తండ్రిని కూడా ఉగ్రవాదులు హతమార్చారు. తమకు వ్యతిరేకంగా పోరాడినందుకే అతన్ని హతమార్చామని వారు ఆరోపించారు.

More Telugu News