ప్రణవ్ రికార్డు గొప్ప విషయం..సచిన్ ట్వీట్ ఆనందం: ప్రణవ్ ధనవాడే తల్లిదండ్రులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రణవ్ రికార్డు గొప్ప విషయం..సచిన్ ట్వీట్ ఆనందం: ప్రణవ్ ధనవాడే తల్లిదండ్రులు

ప్రపంచ క్రికెట్ చరిత్రలో 1009 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి, 117 ఏళ్ల రికార్డును తిరగరాసిన ముంబై యువకుడు ప్రణవ్ ధనవాడే. ఆటోడ్రైవర్ కుమారుడైన ప్రణవ్ పలువురి అభినందనలు అందుకుంటున్నాడు. ఈ సందర్భంగా ప్రణవ్ తల్లిదండ్రులు మాట్లాడుతూ, ‘ప్రణవ్ రికార్డు సాధించడం చాలా గొప్పవిషయం. ఇన్ని పరుగులు చేసి రికార్డు సృష్టిస్తాడని కలలో కూడా ఊహించలేదు. సచిన్ టెండూల్కర్ నా కుమారుడు గురించి ట్వీట్ చేయడం చాలా గొప్ప విషయం. ప్రణవ్ పది, పదకొండేళ్ల వయస్సు నుంచి కష్టపడుతున్నాడు. భవిష్యత్ లోనూ ఇదేవిధంగా శ్రమిస్తాడు. మ్యాచ్ కు వెళ్లే ముందు మంచి స్కోర్ సాధిస్తానని చెప్పాడు. అదే ఆత్మవిశ్వాసంతో మంచి పరుగులు సాధించాడు’ అని వారు పేర్కొన్నారు.

More Telugu News