Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ కపాడియా కన్నుమూత

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.హెచ్.కపాడియా ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ముంబై అంధేరీలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సరోష్ హోమీ కపాడియా భారత ప్రధాన న్యాయమూర్తిగా విలువలున్న సిద్ధాంతాలకు కట్టుబడి, క్రమశిక్షణతో ఉండేవారు. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ పదవీ విరమణ తరువాత కపాడియా చీఫ్ జస్టిస్ అయ్యారు. వొడాఫోన్ కేసు తీర్పు, మీడియా విచారణ విషయంలో ఐదుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు లాంటివి కపాడియా హయాంలోనే వెలువడ్డాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఒక నిరుపేద పార్సీ కుటుంబంలో ఆయన జన్మించారు. స్వయంకృషితో ప్రధాన న్యాయమూర్తి స్థాయికి ఎదిగారు. 2012 సెప్టెంబర్ లో పదవీ విరమణ చేశాక ఆయన ఎలాంటి కమిటీలలో లేరు, మరే ఇతర పదవులు చేపట్టలేదు.

More Telugu News