Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాదులో ఇకపై రాత్రుళ్లు కూడా షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు తెరిచేవుంటాయి

హైదరాబాదులో ఇకపై రాత్రుళ్లు కూడా షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు తెరుచుకోనున్నాయి. వివిధ ప్రైవేటు సంస్థలు రాత్రి వేళల్లో పనిచేస్తుండటంతో ప్రజా అవసరాలకు అనుగుణంగా ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనిపై ఇప్పటికే కార్మికులు, ట్రేడ్ యూనియన్లు, రాష్ట్ర ప్రతినిధులతో కార్మిక శాఖ త్రైపాక్షిక చర్చలు జరిపింది. ఈ చర్చలు ఫలిస్తే ఇకపై రాత్రుళ్లు కూడా షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు తెరిచేవుంటాయి.

More Telugu News