మణిపూర్ భూకంపంపై కేంద్ర హోంమంత్రిత్వ సమీక్ష
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మణిపూర్ భూకంపంపై కేంద్ర హోంమంత్రిత్వ సమీక్ష

రెండుసార్లు సంభవించిన మణిపూర్ భూకంపంపై కేంద్ర కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. ఎన్ డీఎంఏ, ఎన్డీఆర్ఎఫ్, సమాచార శాఖల సమన్వయంపై సమీక్షించింది. రక్షణ మంత్రిత్వ, ఇతర ముఖ్య శాఖలతో కూడా సమీక్ష జరిపింది. భూకంప తీవ్రతకు ఇప్పటివరకు ఐదుగురు చనిపోగా, 43 మందికి గాయాలైనట్టు గుర్తించారు. పలు భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలు దెబ్బతిన్నట్టు అధికారులు అంచనా వేశారు. ఇంపాల్ లో ఆరంతస్తుల భవనం ఒకటి పూర్తిగా కూలిందని హోంమంత్రిత్వ శాఖ అధికారులు ప్రకటించారు. గౌహతి నుంచి ఇంపాల్ కు 45 మంది చొప్పున రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తరలిస్తున్నామని తెలిపారు. సహాయ పునరావాస కార్యక్రమంపై ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు సమాచార వ్యవస్థపై బీఎస్ఎన్ఎల్ అధికారులు దృష్టి సారించారు.

More Telugu News