లండన్ లోని భారత సంతతి వైద్యుడికి 'నైట్ హుడ్' గౌరవం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లండన్ లోని భారత సంతతి వైద్యుడికి 'నైట్ హుడ్' గౌరవం

లండన్ లోని భారత సంతతికి చెందిన హర్పాల్ సింగ్ కుమార్ అనే ప్రఖ్యాత వైద్యుడికి అరుదైన గౌరవం లభించింది. కేన్సర్ వ్యాధి నిపుణుడిగా పనిచేస్తున్న హర్పాల్... ఈ వ్యాధికి చికిత్స, నివారణలో చేసిన సేవలకు గాను ఎలిజబెత్ రాణి అందించే ప్రతిష్ఠాత్మకమైన 'నైట్ హుడ్' (సర్ బిరుదు) వరించింది. ప్రస్తుతం హర్పాల్ లండన్ లోని కేన్సర్ రీసెర్చ్ యూకే సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా సేవలందిస్తున్నారు. ప్రతి సంవత్సరం పలువురు ప్రముఖ వ్యక్తులకు ఈ నైట్ హుడ్ అందజేస్తుంటారు. ఈ ఏడాది కూడా హర్పాల్ తో పాటు ఫండింగ్ సర్కిల్ కంపెనీ సీఈవో సమీర్ దేశాయ్ కి ఆర్థిక రంగంలో చేసిన కృషికిగాను 'కమాండర్ ఆఫ్ మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్' బిరుదు ఇవ్వనున్నారు. ఆఫీసర్ ఆఫ్ మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ జాబితాలో కిడ్డికేర్ లిమిటెడ్ నర్సరీస్ మేనేజింగ్ డైరెక్టర్ కలా పటేల్ పేరు కూడా ఉంది. బ్రిటిష్ ఎంపైర్ పతకాన్ని అశోక్ అనద్ కట్, ఆటిన్ అశోక్ లకు ఇవ్వనున్నారు.

More Telugu News